తెలంగాణ
కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని బ్యాంకర్లకు భట్టి విక్రమార్క పిలుపు
11-11-2026 12:47
ప్రజాభవన్ లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జరిగింది. బ్యాంకింగ్ రంగం రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పిలుపు నిచ్చారు.
xPress24, Hyderabad, November 11,
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకింగ్ రంగం రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి.. ప్రజాభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించామని, అందులో 111 మండలాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు, బ్యాంకులకు మధ్య ఉన్న బంధం దెబ్బతినకూడదని.. కేవలం కార్పొరేట్ గృహ నిర్మాణ సంస్థలకే కాకుండా సామాన్యుల వ్యక్తిగత గృహ నిర్మాణాలకు, విద్యార్థుల ఉన్నత చదువులకు విద్యా రుణాలను ఉదారంగా అందించాలని కోరారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి, మౌలిక వసతుల రంగానికి తగిన రీతిలో రుణ మద్దతు ఇవ్వాలని భట్టి విక్రమార్క బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదుల్లో ఆశించిన వరదలు లేకపోవడంతో సుమారు 10 నుంచి 15 లక్షల బోరుబావుల్లో నీరు అడుగంటిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం నెమ్మదించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. రబీ సీజన్‌కు కేటాయించిన 38 వేల 268 కోట్ల రుణాలను వెంటనే రైతులకు అందించాలని కోరారు. డ్రిప్, స్ప్రింక్లర్ సూక్ష్మ సేద్యంతో పాటు ఆయిల్‌పామ్ సాగు, పాడి, పౌల్ట్రీ వంటి అనుబంధ రంగాలకు రుణాలు అందించి రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
బైట్: భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
బైట్ : తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి