xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణకరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణ
తెలంగాణ

కరువు వేళ రైతాంగాన్ని ఆదుకోవాలి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల పిలుపు

10-11-2026 15:24
తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంట రుణాలను తక్షణమే రీషెడ్యూలింగ్ చేయాలని బ్యాంకర్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మాట్లాడిన ఆయన, రబీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులతో పాటు ఆయిల్‌పామ్, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలకు వాణిజ్య బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేసి రైతులకు అండగా నిలవాలని సూచించారు.
xPress24, Hyderabad, November 10, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. కరువు ప్రభావిత మండలాల్లో రైతుల పంట రుణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం వెంటనే రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేయాలని కోరారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా బ్యాంకర్లే చొరవ తీసుకుని సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడంతో 10 నుంచి 15 లక్షల బోరుబావుల్లో నీరు అందని పరిస్థితి నెలకొందని తెలిపారు. రబీ రుణాల మంజూరు వేగవంతం.. సూక్ష్మ సాగునీరు, అనుబంధ రంగాలకు చేయూత రబీ సీజన్‌కు సంబంధించి నిర్దేశించుకున్న రూ. 38,268 కోట్ల పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు కేటాయించిన రుణ పంపిణీ లక్ష్యాలు పూర్తిస్థాయిలో సాధించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పరికరాలకు వాణిజ్య బ్యాంకులు విరివిగా రుణాలు అందించాలన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణతో పాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పశుపోషణ, ఎఫ్‌పీఓలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాల కోసం సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. బైట్ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.