ఆంధ్రప్రదేశ్
కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం
11-11-2026 09:43

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణ, భూములకు సంబంధించిన వివరాలపై కేంద్ర కమిటీ కోరిన అదనపు సమాచారాన్ని సమర్పించాలని అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లేరు పరిధిలోని డి-ఫారం భూముల వివరాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన మ్యాప్‌లు, బాధితుల పునరావాస ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పర్యావరణ ప్రభావాలపై నిపుణుల నివేదికలను రూపొందించి కేంద్ర సాధికార కమిటీకి సమర్పించాలని స్పష్టం చేశారు.
xPress24, Eluru, November 11,