xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలుకృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలు
తెలంగాణ

కృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

18-11-2026 15:52
నాగార్జునసాగర్ నుంచి 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కృష్ణా జలాల కేటాయింపులు, కేఆర్ఎంబీకి చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
xPress24, Hyderabad, November 18, నాగార్జునసాగర్ నుంచి సొరంగం ద్వారా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తాగునీటి అవసరాలకే నీటి కొరత ఏర్పడుతున్న సమయంలో ఏపీ నీటి తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందా, రాష్ట్ర వాటాలో మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని లేఖ రాసిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎంత నీటిని నిల్వ ఉంచుతున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. కేఆర్ఎంబీలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ఎంపీల మౌనంపై ప్రశ్నలు.. నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో బహిరంగ సభలు రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలుగుతుంటే తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏపీ చేపడుతున్న నీటి తరలింపు ప్రాజెక్టును నిలిపివేసేలా కేఆర్ఎంబీకి ఆదేశాలు ఇప్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొహమాటాలు ఉండొచ్చని, తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్‌కు ఎలాంటి మొహమాటాలు లేవని పేర్కొన్నారు. ఏపీ నీటి తరలింపుపై బీఆర్ఎస్ తరఫున కేఆర్ఎంబీకి లేఖ రాస్తామని, అవసరమైతే న్యాయపోరాటంతో పాటు ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని ప్రకటించారు. నీటి హక్కులపై ప్రజలను చైతన్యపరిచేందుకు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. Bytes: కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.