xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జలాల పంపకాలపై ముగిసిన త్రిసభ్య కమిటీ భేటీ.. నిర్ణయం వాయిదా

24-11-2026 12:12
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటి పంపకాలపై హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఏపీ 19 టీఎంసీలు, తెలంగాణ 21 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరాయి. నాగార్జునసాగర్‌లో ఉన్న 45 టీఎంసీల నీటిని వచ్చే జులై వరకు జాగ్రత్తగా వాడుకోవాలని, హైదరాబాద్ తాగునీటి కోసమే 15 టీఎంసీలు కోరినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్ బాబు వెల్లడించారు.
xPress24, Hyderabad, November 23, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటి పంపకాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా తమ అవసరాల కోసం 19 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కోరగా, ఫిబ్రవరి నాటికి 21 టీఎంసీలు కావాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. అయితే ఇరు రాష్ట్రాల వాదనలు విన్న త్రిసభ్య కమిటీ, నీటి కేటాయింపులపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించింది. హైదరాబాద్ తాగునీటికి 15 టీఎంసీలు కోరామన్న ఈఎన్సీ రమేశ్ బాబు కమిటీ సమావేశం అనంతరం తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) రమేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం మొత్తం 45 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని తెలిపారు. వచ్చే ఏడాది జులై వరకు ఈ నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసమే వచ్చే ఏడాది జులై వరకు 15 టీఎంసీల నీరు కావాలని బోర్డును కోరినట్లు వెల్లడించారు. సాగర్ నీటిని తాగునీటి అవసరాలతో పాటు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు మాత్రమే వినియోగించాలని సమావేశంలో స్పష్టం చేసినట్లు రమేశ్ బాబు వివరించారు. Bytes: రమేశ్ బాబు, నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, తెలంగాణ

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.