ఆంధ్రప్రదేశ్
కృష్ణా జిల్లాలో 197 నామినేషన్లు
24-10-2026 15:05

కృష్ణా జిల్లాలోని 26 మండలాలకు సంబంధించి జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిన్నటితో ముగిసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే. బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజులలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 197 నామినేషన్లు వచ్చినట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 67 నామినేషన్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 64, జనసేన పార్టీ నుంచి 31, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి 12, భారతీయ జనతా పార్టీ నుంచి 10, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 7, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 4, సీపీఐ(ఎం) నుంచి 2 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.
xPress24, MACHILIPATNAM, October 24,