ఆంధ్రప్రదేశ్
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖలు
11-11-2026 09:45

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు బోర్డు లేఖలు రాసింది. ప్రాజెక్టుల కింద ఉన్న వివిధ కాంపొనెంట్లు, వాటికి లభించిన అనుమతుల వివరాలను సమర్పించాలని సూచించింది. ఎడమ, కుడి కాల్వల ద్వారా నీటి మళ్లింపు, వినియోగం, ఆయకట్టు పరిధి, ప్రాజెక్టుల డిజైన్, సాంకేతిక అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని స్పష్టం చేసింది. సాగునీరు, విద్యుత్, తాగునీటి అవసరాల్లో చోటుచేసుకున్న మార్పుల వివరాలు కూడా ఇవ్వాలని పేర్కొంది. ప్రాజెక్టుల్లో చేసిన మార్పులకు సంబంధించిన సాంకేతిక అనుమతుల రికార్డులను కూడా సమర్పించాలని ఉభయ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.
xPress24, Amaravati, November 11,