xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ

20-11-2026 10:01
కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం ప్రారంభించారు.
xPress24, Machilipatnam, November 19, మచిలీపట్నం, నవంబర్ 19: కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న డీజీపీకి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఘనస్వాగతం పలికారు. అనంతరం కమాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, సీసీ కెమెరాల నెట్‌వర్క్, పర్యవేక్షణ విధానం, పోలీస్ సేవల సమన్వయం తదితర అంశాలను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు డీజీపీకి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తున్న కృష్ణాజిల్లా పోలీసుల పనితీరును ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. జిల్లాలో అమలు చేస్తున్న త్రినేత్ర యాప్ పనితీరును డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలను త్రినేత్ర యాప్ సహకారంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతం చేస్తామని డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాలతో పాటు ఇతర సాంకేతిక సంబంధిత నేరాలను సమర్థవంతంగా గుర్తించి, కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రతి జిల్లాలో 20 మంది సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ వ్యవస్థలో విస్తృతంగా వినియోగించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ వివరించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.