తెలంగాణ
కేసీఆర్ నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు- మంత్రి వివేక్
26-11-2026 11:58
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ చేసిన రూ.8లక్షల కోట్ల అప్పులకు రూ.80వేల కోట్ల వడ్డీలు చెల్లించామన్నారు.
xPress24, మందమారి, November 25,
మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పులపాలైందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా 23వ వార్డులో 58 లక్షల రూపాయల TUFIDC నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం 2, 3, 19, 22 వార్డులలో 2 కోట్ల రూపాయల TUFIDC నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. మందమర్రిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, త్వరలోనే 50 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని కూడా చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8లక్షల కోట్ల అప్పలకు ప్రజా ప్రభుత్వం రూ.80వేల కోట్ల వడ్డీలు చెల్లించామన్నారు. కాంగ్రెస్ పాలనలో 2 లక్షల కొత్త పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ.9వేల కోట్లు చెల్లించిందని వెల్లడించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చెన్నూరు నియోజకవర్గంలో 350 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. మందమర్రిలోని 7 ఎకరాల సింగరేణి స్థలంలో హైదరాబాద్ తరహాలో టవర్స్ నిర్మించి, అర్హులైన వెయ్యి మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.
బైట్- వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి