xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
జాతీయం

ఖలిస్తాన్ ఉగ్రవాద మద్దతుదారు సురీందర్ సింగ్‌ను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

19-11-2026 09:49
ఖలిస్తాన్ ఉగ్రవాద మద్దతుదారు సురీందర్ సింగ్‌ను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ
నిషేధిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ మద్ధతుదారు సురీందర్ సింగ్ అలియాస్ థిక్రివాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురై భారత్‌కు తిరిగి వచ్చిన సురీందర్ సింగ్ ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
xPress24, Delhi, November 18, నిషేధిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ మద్ధతుదారు సురీందర్ సింగ్ అలియాస్ థిక్రివాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురై భారత్‌కు తిరిగి వచ్చిన సురీందర్ సింగ్ ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు విదేశాల్లో ఉంటూ దేశ వ్యతిరేక శక్తులకు సహకరిస్తున్న పలు తీవ్రమైన కేసుల్లో సురీందర్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు. అమెరికాలో తలదాచుకుంటున్న థిక్రివాల్‌ కదలికలపై భారతీయ దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టి, ఆ దేశ ప్రభుత్వంతో జరిపిన సమన్వయ చర్చల ఫలితంగా భారత్‌కు రప్పించాయి. విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన థిక్రివాల్‌ను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్, విదేశీ నిధులు, స్లీపర్ సెల్స్ వివరాలను రాబట్టేందుకు NIA అధికారులు లోతుగా విచారించనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.