తెలంగాణ
గిగ్ వర్కర్ల సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
12-11-2026 14:28
ఈ నెల 14న హెచ్ఐసీసీలో జరిగే గిగ్ వర్కర్ల సభ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు.
xPress24, Hyderabad, November 12,
గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి హెచ్ఐసీసీ వేదిక ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా వేదిక నిర్మాణం, గిగ్ వర్కర్ల రాకపోకలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
నూతన పథకాల ప్రారంభం
ఈ కార్యక్రమంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన కీలక నిబంధనలు, నూతన పథకాలను రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.