ఆంధ్రప్రదేశ్
గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
05-11-2026 12:15

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
xPress24, Vizianagaram, November 5,
విజయనగరం జిల్లా, నవంబర్ 5:
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన గొప్ప ఆయుధమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, విలువైన ఓటును వృథా చేసుకోవద్దని పిలుపునిచ్చారు.