xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలితుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆంధ్రప్రదేశ్

గోడ కూలి గాయపడిన కుటుంబానికి మంత్రి సంధ్యారాణి పరామర్శ

29-10-2026 09:32
అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గుమ్మిడిగుడ్డివలస గ్రామంలో గోడ కూలి గాయపడిన కుటుంబాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరామర్శించారు.
xPress24, Paravathipuram, October 28, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 28: అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గుమ్మిడిగుడ్డివలస గ్రామంలో గోడ కూలి గాయపడిన కుటుంబాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో గుమ్మిడిగుడ్డివలస గ్రామంలో ఇంటి పక్కన ఉన్న గోడ కూలిన ఘటనలో కొర్ర మహేష్, కొర్ర తౌడమ్మ దంపతులతో పాటు వారి తొమ్మిది నెలల శిశువు తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో అధికారులు తక్షణమే స్పందించి, శిశువుకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబం గురించి తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలతో పాటు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ అందిన వెంటనే అధికారులు శిశువును సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో విజయనగరంలోని ఘోషా ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శిశువు చురుగ్గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆశా కార్యకర్త, ఏఎన్ఎం శిశువు వెంట ఉండి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.