xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
తెలంగాణ

గోదావరి పుష్కరాల లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పనకు ఆహ్వానం

24-11-2026 12:13
వచ్చే ఏడాదిలో చేపట్టే పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలపై విస్తతృంగా ప్రచారం కోసం చర్యలు తీసుకుంటోంది. గోదావరి పుష్కరాల అధికారిక లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పనకు తెలంగాణ దేవాదాయ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విజేతలకు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది.
xPress24, HYDERABAD, November 24, గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభం కానున్నాయి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముమ్మర సన్నాహాలు చేపట్టింది. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, రహదారులు, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక ప్రణాళికలతో పనులు చేపట్టింది. మరోవైపు పుష్కరాలపై ప్రజల్లో విస్తతృంగా ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. లోగో, ట్యాగ్ లైన్ రూపకల్పనకు ఆహ్వానం గోదావరి పుష్కరాలపై ప్రచారంలో భాగంగా లోగో, ట్యాగ్ లైన్ రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి  ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని భావిస్తోంది. లోగో, ట్యాగ్ లైన్ రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తోంది. ఇందుకోసం  కళాకారులు, డిజైనర్లు, విద్యార్థులు, ఔత్సాహికుల నుంచి తెలంగాణ దేవాదాయశాఖ  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గోదావరి నది ఆధ్యాత్మిక ప్రాధాన్యం, సంప్రదాయాలు, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా లోగో ఉండాలని, భక్తులను ఆకట్టుకునేలా తెలుగు,  ఆంగ్లం లేదా రెండు భాషల్లో ట్యాగ్‌లైన్ సమర్పించాలని అధికారులు సూచించారు. విజేతలకు బహుమతుల ప్రకటన గోదావరి పుష్కరాలపై లోగో, ట్యాగ్ లైన్ దరఖాస్తులను పంపేందుకు  ఈనెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. రాష్ట్రస్థాయి కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ ప్రతిపాదనలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొదటి బహుమతిగా రూ. లక్ష , రెండో బహుమతిగా రూ. 50వేలు, మూడో బహుమతిగా రూ. 25 వేలు అందజేయనున్నారు.  విజేతలతో కలిపి టాప్ 100 ఎంట్రీలకు గుర్తింపు ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు లోగో, ట్యాగ్‌లైన్‌లను కలిపి godavaripushkaralutg@gmail.com ఈ-మెయిల్, పోస్ట్ ద్వారా పంపవచ్చు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నేరుగా కూడా అందజేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. బైట్- పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.