xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
జాతీయం

గిరిజన జీవనశైలి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

24-10-2026 09:51
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బస్తర్ దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గిరిజనుల ప్రకృతి ప్రేమికుల జీవనశైలి నుంచి ఎంతో నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
xPress24, Chhattisgarh, October 23, గిరిజన తెగల ప్రకృతిని ప్రేమించే జీవనశైలి నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో జరిగిన బస్తర్ దసరా వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు జగదల్‌పూర్‌లోని దంతేశ్వరి దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మురియా దర్బార్‌లో స్థానిక మంఝీ, చల్కీలతో ముచ్చటించారు. ఈ వేడుకల్లోని ఆచారాలు సమాజంలోని వివిధ వర్గాల మధ్య పరస్పర సంబంధాలను, బంధుత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. బస్తర్ దసరా సాంస్కృతిక ప్రతీక బస్తర్ దసరా ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక వైభవానికి, సమిష్టి నమ్మకానికి సజీవ ప్రతీక అని రాష్ట్రపతి కొనియాడారు. గిరిజన పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలు ఊపందుకున్నాయని వెల్లడించారు. గిరిజనుల సంస్కృతిని, సంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బైట్ - ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.