xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలుకృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలు
ఆంధ్రప్రదేశ్

గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి

18-11-2026 10:00
గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి
గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు.
xPress24, Parvathipuram, November 17, పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 17: గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం-జన్మన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు, డోలి రహదారుల నిర్మాణం, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులతో పాటు ఇతర నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల వారీగా ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకుని, అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. పీఎం-జన్మన్ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని, డోలి రహదారుల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ సూచించారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్ పనులన్నింటినీ వెంటనే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అభివృద్ధి పనిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, గిరిజన విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.