xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
ఆంధ్రప్రదేశ్

గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

22-10-2026 15:59
గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు తిరిగి వచ్చిన గిరిజన విద్యార్థినుల ఆరోగ్యం, ఆహారం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 22, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 22: దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు తిరిగి వచ్చిన గిరిజన విద్యార్థినుల ఆరోగ్యం, ఆహారం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. గురువారం కొమరాడ మండలం ఉలిపిరి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, వంటగది, మరుగుదొడ్లను తనిఖీ చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చిన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. విద్యార్థినులకు సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు, వంటగదిలో పరిశుభ్రమైన వాతావరణాన్ని పాటిస్తూ నాణ్యమైన ఆహారాన్ని తయారు చేయాలని సూచించారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థినులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.