ఆంధ్రప్రదేశ్
గిరిజనుల హక్కులు కోసం పోరాడిన బిర్సా ముండా
13-11-2026 10:13

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్ ను’ గురువారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ గిరిజన అధ్యయన విభాగం ఆధ్వర్యంలో “బిర్సా ముండా: గిరిజన గర్వం, అస్తిత్వం, అభివృద్ధి” అనే అంశంపై ఒకరోజు రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నాగరాజు మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. విద్య, సామాజిక చైతన్యం, ఆర్థికాభివృద్ధి ద్వారా గిరిజన యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
xPress24, Vizainagaram, November 13,