జాతీయం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సేవలు అందించాలి: రాష్ట్రపతి
26-11-2026 14:25

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జాతీయ హోమియోపతి శాస్త్రీయ సదస్సులో రాష్ట్రపతి పాల్గొన్నారు.
xPress24, Bhuvaneshwar, November 26,
హోమియోపతి వైద్యంపై విశ్వాసం పెంచేందుకు శాస్త్రీయ పరిశోధనలు, రోగుల భద్రతను బలోపేతం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జాతీయ హోమియోపతి శాస్త్రీయ సదస్సులో మాట్లాడుతూ... 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఆరోగ్యం, విద్య రెండు కీలక స్తంభాలని చెప్పారు. శాస్త్రీయ ప్రమాణాలు, క్లినికల్ ఆధారాలతో హోమియోపతి భవిష్యత్తు ముందుకు సాగాలన్నారు. వైద్య సంస్థల మధ్య సమన్వయం, కృత్రిమ మేధ, డిజిటల్ ఆరోగ్య సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోగుల భద్రత, మానవీయ విలువలతో కూడిన వైద్య సేవలు అందించాలని రాష్ట్రపతి సూచించారు.
బైట్: ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి