xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లుసింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్ డీకే బాలాజీ

11-11-2026 09:31
గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్ డీకే బాలాజీ
రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను ప్రతి అధికారి తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
xPress24, Machilipatnam, November 10, మచిలీపట్నం, నవంబరు 10: రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను ప్రతి అధికారి తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్‌–1, స్టేజ్‌–2 రిటర్నింగ్ అధికారులకు (ROs) కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్టేజ్‌–1 రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణ నుంచి తుది పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ వరకు ప్రతి దశలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి అధికారి తప్పనిసరిగా చెక్‌లిస్ట్‌ను అనుసరిస్తూ అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నామినేషన్ పత్రాల్లో పొందుపరచాల్సిన తప్పనిసరి వివరాలు, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, ఇతర అవసరమైన సమాచారంపై అభ్యర్థులకు ముందుగానే స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులో అన్ని చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేజ్‌–2 రిటర్నింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని స్వీకరించే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. చెక్‌లిస్ట్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని పరిశీలించి, సామగ్రి అంతా సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే స్వీకరించాలన్నారు. ముఖ్యంగా బ్యాలెట్ బాక్సులు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, బ్యాలెట్ పేపర్లు సీరియల్ క్రమంలో ఉన్నాయా, వాటి నాణ్యత సరిగ్గా ఉందా అనే అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. చిరిగిన, దెబ్బతిన్న బ్యాలెట్ పేపర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరాదని, వాటి స్థానంలో నాణ్యమైన బ్యాలెట్ పేపర్లను తీసుకోవాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డుల జారీతో పాటు, వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.