తెలంగాణ
'గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2026' ప్రకటన.. నామినేషన్లకు డిసెంబర్ 10 తుది గడువు
17-11-2026 11:25
సమాజ సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు తెలంగాణ లోక్‌భవన్ 'గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2026' పురస్కారాలను ప్రకటించింది. నాలుగు విభాగాల్లో వ్యక్తిగత, సంస్థాగత కేటగిరీల కింద మొత్తం ఎనిమిది అవార్డులను గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేయనున్నారు. ప్రతి విజేతకు రూ. 2 లక్షల నగదు పురస్కారం అందించనుండగా, నామినేషన్ల దాఖలుకు 2026 డిసెంబర్ 10 చివరి తేదీగా నిర్ణయించారు.
xPress24, Hyderabad, November 17,
సమాజ సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ ఆదేశాల ప్రకారం లోక్‌భవన్ 'గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2026' పురస్కారాలను ప్రకటించింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోక్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, జాయింట్ సెక్రటరీ శశికిరణ్ ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. మొత్తం నాలుగు విభాగాల్లో ఒక్కో విభాగానికి వ్యక్తిగత, సంస్థాగత కేటగిరీల్లో ఎనిమిది అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.
రూ. 2 లక్షల నగదు పురస్కారం.. గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం
ఈ పురస్కారాలకు ఎంపికైన ప్రతి అవార్డు గ్రహీతకు రూ. 2 లక్షల నగదు బహుమతితో పాటు జ్ఞాపికను గవర్నర్ అందజేసి సత్కరిస్తారని అధికారులు వివరించారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి నామినేషన్ల స్వీకరణకు 2026 డిసెంబర్ 10వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.
బైట్
దాన కిషోర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గవర్నర్
శశికిరణ్, జాయింట్ సెక్రటరీ, లోక్‌భవన్