xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

చెడుపై మంచి సాధించిన విజయమే దసరా: బండి సంజయ్

21-10-2026 09:30
కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని రావణ దహనం చేశారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దసరా పర్వదినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. మహాశక్తి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారని పేర్కొంటూ తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
xPress24, Karimnagar, October 20, ఎన్నటికైనా చెడుపై విజయం సాధించేది ‘మంచి’ మాత్రమేనని, దుర్మార్గమైన పనులు చేసే వారికి ఎన్నటికీ విజయం దక్కదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని, శాస్త్రోక్తంగా రావణ దహనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి కరుణతో సకల శుభాలు కలుగుతాయి: బండి సంజయ్ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని తెలుగు కుటుంబాలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయానికి రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారని, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో భవానీ దీక్షలు చేపట్టారని తెలిపారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి నిలుస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. బైట్స్ బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కోలగాని శ్రీనివాస్, మేయర్, కరీంనగర్ నగరపాలక సంస్థ

🎥 వీడియో

చెడుపై మంచి సాధించిన విజయమే దసరా: బండి సంజయ్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.