తెలంగాణ
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
02-11-2026 17:14
'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' మహా పాదయాత్ర కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
xPress24, Hyderabad, November 2,
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో విపక్షాలు చేపట్టిన నిరసనలకు దీటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' అనే నినాదంతో నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు
విమానాశ్రయం నుంచి అమిత్ షా నేరుగా పాతబస్తీలోని చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందించారు.