ప్రాంతీయం
జంగారెడ్డిగూడెం లేఖరి కార్యాలయంలో అగ్నిప్రమాదం.. దస్తావేజులు దగ్ధం
09-11-2026 12:34
జంగారెడ్డిగూడెం లేఖరి కార్యాలయంలో అగ్నిప్రమాదం.. దస్తావేజులు దగ్ధం
XPress24 జంగారెడ్డిగూడెం 09-11-2026
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఉన్న లేఖరి కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం, భారీ ఆస్తినష్టం జరగకుండా అడ్డుకోగలిగారు.
అయితే ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయంలోని కొన్ని దస్తావేజులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను అదుపు చేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరికి చేతి కి గాయమైంది.
సకాలంలో స్పందించి ప్రమాద తీవ్రతను తగ్గించిన అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులను స్థానికులు అభినందించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించి వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.