ప్రాంతీయం
జంగారెడ్డిగూడెంలో దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి చేసి ప్రియుడు పరారీ
31-10-2026 12:12

జంగారెడ్డిగూడెంలో దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి చేసి ప్రియుడు పరారీ
xPress24 జంగారెడ్డిగూడెం: 31-10-2026
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలవరం మండలం తంగెళ్లగూడెం గ్రామానికి చెందిన స్వప్న (29) జంగారెడ్డిగూడెం పట్టణంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ స్థానికంగా ఓ బ్యాకరీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.దాడి అనంతరం నిందితుడు రామకృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో ఆమెను తొలుత జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది.
కాగా, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీఐ ఎం.ఐ. సుభాష్, ఎస్సై వీరప్రసాద్ బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనను ఇష్టపడిన వ్యక్తే కత్తితో పొడిచాడని స్వప్న పోలీసులకు తెలిపింది.
రామకృష్ణ, స్వప్న కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, అయితే ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం జంగారెడ్డిగూడెం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.