ప్రాంతీయం
జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు!
02-11-2026 12:32

జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు!
xPress24 జంగారెడ్డిగూడెం 02-10-2026
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పట్టణంలో మొత్తం 61.06 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల అధికారులు, పరిశీలకులు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు.పోలింగ్ అనంతరం సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను భారీ పోలీసు భద్రత మధ్య స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్‌కు సీలు వేసి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పుర ఎన్నికల అధికారి కె.వి. రమణ తెలిపారు.ఓట్ల లెక్కింపు వరకు బ్యాలెట్ బాక్సులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.