ప్రాంతీయం
జంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!
20-11-2026 11:58
జంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!
XPress24 Jangareddygudem 20-11-2026
జంగారెడ్డిగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
విద్యుత్ స్తంభం పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
జంగారెడ్డిగూడెం నుంచి కామవరపుకోట వెళ్లే మార్గంలోని సాయిపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
విద్యుత్ శాఖ సిబ్బంది చెట్లు నరికే సమయంలో చెట్టు కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో విద్యుత్ స్తంభం వద్ద ఉన్న ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.