xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
తెలంగాణ

జగిత్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం...

31-10-2026 12:12
18 సంవత్సరాల లోపు పిల్లలందరూ పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మట్ట సరిత అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ, ఏవయినా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలిపారు.
xPress24, Chalgal, October 31, జగిత్యాల జిల్లా చల్ గల్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మట్ట సరిత ముఖ్య అతిథిగా హాజరై పొక్సో పై అవగాహన కల్పించారు. పోలీస్ కళా బృందం వారు పొక్సో చట్టంపై పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు పిల్లల హక్కులను, బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మట్ట సరిత మాట్లాడుతూ  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ పోక్సో చట్టంపై  అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.  పిల్లలు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి తాగిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఒక్కసారి కేసు నమోదు అయితే పై చదువులకు వెళ్లే అవకాశం గాని, ఉద్యోగులు పొందే అవకాశం ఉండదని అందుకని గంజాయి మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. పిల్లలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ను సంప్రదించవచ్చునని అన్నారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలపై  లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అశ్లీల కార్యకలాపాల పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. విద్యార్థినులకు తమ శరీరంపై తమకే హక్కు ఉందని, ఎవరైనా అనుచితంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక ఉద్దేశంతో బెదిరించడం లేదా ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపడం వంటి చర్యలను నిర్లక్ష్యం చేయకూడదని వివరించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. పిల్లలకు ఏవైనా సమస్యలు వున్నా, బాల్య వివాహాలు జరిగిన  1098 కాల్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బైట్స్: 1. మట్ట సరిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి 2.  సురేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.