xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
ఆంధ్రప్రదేశ్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

22-10-2026 17:48
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు), నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంతి టి. ఆదేశించారు.
xPress24, Paderu, October 22, పాడేరు, అక్టోబర్ 22: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు), నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంతి టి. ఆదేశించారు. గురువారం పాడేరు కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆర్‌ఓలు, నోడల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల విధులు, బాధ్యతలు, ఎన్నికల నియమావళి అమలు తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, ఎన్నికల విధులకు సంబంధించి అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లు, క్షేత్రస్థాయి పరిస్థితులు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై నిరంతరం సమీక్షించేందుకు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు నిర్ణీత సమయానికి టెలీకాన్ఫరెన్స్‌కు హాజరై, తమ పరిధిలోని ఎన్నికల ఏర్పాట్లపై స్పష్టమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను గౌరవించి పాటించాలని కోరారు. ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, శిక్షణా కార్యక్రమాల్లో వివరించిన అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి దశలోనూ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎన్నికల విధులు, బాధ్యతలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, అధికారుల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమని అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల పరిశీలకుడు సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.