సినిమా
జాతీయ చలనచిత్ర పురస్కారాలు –రాష్ట్రపతి
23-09-2026 05:30
భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలు, సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలన చిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నకేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విజేతలకు అభినందనలు తెలుపుతూ.. తెర వెనుక పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్వినీ వైష్ణవ్ ఆహ్వానం పలికారు.
xPress24, Krishna District, September 22,