xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
తెలంగాణ

జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు

20-11-2026 11:24
జాతీయ రహదారుల అభివృద్ధికి  ప్రతిపాదనలు
తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.హైదరాబాద్ లో నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి సంబంధించిన తొమ్మిది కీలక అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఇందులో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్ర ఆమోదం, దక్షిణ భాగానికి అనుమతులు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.అలాగే తెలంగాణలోని 23 రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రాజెక్టుల అమలుకు భూసేకరణ, ఇతర అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, November 20, తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని  కోరారు.హైదరాబాద్ లో నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి సంబంధించిన తొమ్మిది కీలక అంశాలతో కూడిన వినతిపత్రాన్ని  అందజేశారు. ఇందులో   రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్ర ఆమోదం, దక్షిణ భాగానికి అనుమతులు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.అలాగే తెలంగాణలోని 23 రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రాజెక్టుల అమలుకు భూసేకరణ, ఇతర అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.