విద్య
జాతీయ విద్యా దినోత్సవం
11-11-2026 10:03

ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో బుధవారం దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, విద్యావేత్త, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది ఆయనకు లభించిన బిరుదు కాగా, ఆజాద్ ఆయన కలం పేరు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, స్వాతంత్య్రానంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో విద్యారంగ అభివృద్ధికి, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు ఆయన విశేష కృషి చేశారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్య ప్రాధాన్యత, అక్షరాస్యత, నాణ్యమైన విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
xPress24, New Delhi, November 11,