xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లుసింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

జనాభా గణనను పక్కాగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

11-11-2026 09:31
జనాభా గణనను పక్కాగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
జిల్లాలో జనాభా గణన ప్రక్రియను ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
xPress24, Bapatla, November 10, బాపట్ల, నవంబర్ 10: జిల్లాలో జనాభా గణన ప్రక్రియను ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెండో విడత జనాభా గణనకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహశీల్దార్లకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా గణనలో జిల్లాలో ఏ ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరి వివరాలను బాధ్యతాయుతంగా సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, గణన సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, జనాభా గణన ప్రాముఖ్యతను వివరించి వారి సహకారం పొందాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబంలోని ప్రతి ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గణన చేపట్టాలని స్పష్టం చేశారు. సేకరించిన వివరాల్లో ఖచ్చితత్వం ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో జనాభా గణన విధివిధానాలు, సమాచార సేకరణ, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన జాగ్రత్తలు, అధికారుల బాధ్యతలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.