ఆంధ్రప్రదేశ్
జనాభా గణనపై క్షేత్రస్థాయి శిక్షకుల రెండో బ్యాచ్ శిక్షణ పూర్తి
19-11-2026 09:48

జనాభా గణనలో భాగంగా క్షేత్రస్థాయి శిక్షకులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో రెండో బ్యాచ్ శిక్షణ బుధవారం ముగిసింది.
xPress24, Visakhapatanam, November 18,
విశాఖపట్నం: జనాభా గణనలో భాగంగా క్షేత్రస్థాయి శిక్షకులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో రెండో బ్యాచ్ శిక్షణ బుధవారం ముగిసింది. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జీవీఎంసీ సౌత్ జోన్ సమావేశ మందిరంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం ఆర్డీఓ ఎస్.డి. అనిత మాట్లాడుతూ, శిక్షణలో పాల్గొన్న క్షేత్రస్థాయి శిక్షకులు జనాభా గణనకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు సమగ్రంగా శిక్షణ అందించాలని తెలిపారు. రానున్న జనాభా గణన ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.
శిక్షణ పూర్తి చేసుకున్న క్షేత్రస్థాయి శిక్షకులు మండల స్థాయిలో సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించనున్నారు. ముగింపు కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ ఎస్. దయాసాగర్, మాస్టర్ ట్రైనర్లు వై. జగన్నాధపురి, పి. ఆశాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.