ఆంధ్రప్రదేశ్
జనాభా లెక్కల సేకరణ దేశ అభివృద్ధికి కీలకం
13-11-2026 09:34
ఒంగోలు: దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా లెక్కల సేకరణ ఎంతో కీలకమని రాష్ట్ర జనాభా లెక్కల సేకరణ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
xPress24, Ongole, November 12,
ఒంగోలు: దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా లెక్కల సేకరణ ఎంతో కీలకమని రాష్ట్ర జనాభా లెక్కల సేకరణ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రెండో విడత జనాభా లెక్కల సేకరణపై గురువారం ఒంగోలు కలెక్టరేట్‌లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని తహసీల్దార్లు (ఎమ్మార్వోలు), ఎంపీడీవోలు, ఇతర శాఖల సిబ్బంది కలిపి మొత్తం 140 మంది పాల్గొన్నారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్యూమరేటర్ల బాధ్యతలు, సమాచార నమోదు విధానం తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఆకాశవాణితో మాట్లాడుతూ.. రెండో విడత జనాభా లెక్కల సేకరణను వచ్చే ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ సజావుగా నిర్వహించేందుకు చార్జ్ ఆఫీసర్లు, సంబంధిత సిబ్బందికి శిక్షణ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.