ఆంధ్రప్రదేశ్
జనాభా లెక్కల సేకరణపై అధికారులకు శిక్షణ
21-11-2026 09:47
దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా లెక్కల సేకరణ కీలక పాత్ర పోషిస్తుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
xPress24, Marakapur, November 20,
మార్కాపురం: దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా లెక్కల సేకరణ కీలక పాత్ర పోషిస్తుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రెండో విడత జనాభా లెక్కల సేకరణకు సంబంధించి అధికారులు, సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
రాష్ట్ర జనాభా లెక్కల సేకరణ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనాభా లెక్కల సేకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై అధికారులు, సిబ్బందికి వివరించారు. ప్రజల నుంచి సేకరించాల్సిన సమాచారంపై అవగాహన కల్పించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.