ఆంధ్రప్రదేశ్
జిలెటిన్‌స్టిక్స్ పేలి.. ఐదుగురు మృతి
24-10-2026 14:49

అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పేలుడు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
xPress24, Hyderabad, October 24,
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల కోసం బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. ఇందుకోసం జిలెటిన్ స్టిక్స్‌ను అమర్చిన ప్రత్యేక పరికరాన్ని వినియోగించారు. ఈ యంత్రంలో డీజిల్ నింపుతుండగా మంటలు చెలరేగి పేలుడు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు కార్మికులు, ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులను టీచర్ సునీత(విశాఖ), మణి (దేవరాపల్లి), నారాయణ రావు(చీడకాడ), పవన్ కుమార్(కడప)గా గుర్తించారు.