ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయం
04-11-2026 12:10

జీవీఎంసీ మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై 2,44,644 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
xPress24, Visakhapatanam, November 4,
విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై 2,44,644 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శ్రావణికి 5,85,454 ఓట్లు రాగా, వరుదు కల్యాణికి 3,40,810 ఓట్లు లభించాయి.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో రిటర్నింగ్ అధికారి బి. దయానిధి తన ఛాంబర్‌లో ముక్కా శ్రావణికి ఎన్నికల విజయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో మేయర్ ఎన్నిక ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది.
మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ శ్రావణి ఆధిక్యం కనబరిచారు. కార్పొరేటర్ స్థానాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు వరుస విజయాలు సాధించడంతో జీవీఎంసీలో కూటమి హవా కొనసాగింది. గత ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వైసీపీ ఈసారి కేవలం 13 స్థానాలకే పరిమితమైంది.