xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం
తెలంగాణ

జవహర్ నగర్ డంప్‌యార్డును తరలించాలి: ఈటల రాజేందర్

22-10-2026 09:15
జవహర్ నగర్ డంప్‌యార్డును తరలించాలి: ఈటల రాజేందర్
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ఉన్న జవహర్ నగర్ డంప్‌యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ లో ఆయన బుధవారం మాట్లాడుతూ, డంప్‌యార్డు నుంచి వెలువడుతున్న మీథేన్ గ్యాస్‌తో పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి రేపు డంప్‌యార్డు బాధితులతో సమావేశం, 25న పర్యావరణవేత్తలు, మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి డంప్‌యార్డుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.వ్యర్ధాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, స్థానిక ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ కోరారు.
xPress24, Malkajgiri, October 22, హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ఉన్న జవహర్ నగర్ డంప్‌యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ లో ఆయన బుధవారం  మాట్లాడుతూ, డంప్‌యార్డు నుంచి వెలువడుతున్న మీథేన్ గ్యాస్‌తో పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి రేపు  డంప్‌యార్డు బాధితులతో సమావేశం, 25న పర్యావరణవేత్తలు, మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి డంప్‌యార్డుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.వ్యర్ధాల  నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, స్థానిక ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ  ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ కోరారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.