ప్రాంతీయం
జీలుగుమిల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు
02-11-2026 11:49

జీలుగుమిల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు
xPress24 జంగారెడ్డిగూడెం 02-10-2026.
జీలుగుమిల్లి మండల కేంద్రంలోని హైస్కూల్ సమీప జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్‌తో పాటు సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనతో రహదారిపై కొద్దిసేపు కలకలం రేగింది.