xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
ఆంధ్రప్రదేశ్

టెక్కలి మండల పరిషత్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

20-11-2026 10:00
టెక్కలి మండల పరిషత్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది.
xPress24, Srikakulam, November 19, శ్రీకాకుళం, నవంబర్ 19: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. గురువారం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతన మండల పరిషత్ అధ్యక్షురాలు, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ), ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టెక్కలి మండలానికి చెందిన 21 మంది ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మండల పరిషత్ అధ్యక్షురాలికి, ఎంపీటీసీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.