ఆంధ్రప్రదేశ్
టోకన్లు, టికెట్ల విడుదల
24-11-2026 12:21

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకన్లు, టికెట్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. డిసెంబర్ 20, 21 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా సర్వదర్శనం టోకన్లను ఈ-డిప్ విధానంలో కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈనెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 2వ తేదీసాయంత్రం 5 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 4వ తేదీన డిప్ ద్వారా లక్షా 60 వేల టోకన్లు కేటాయిస్తారని పేర్కొంది. శ్రీవాణి టికెట్లు ఈనెల 25వ తేదీన, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈనెల 26వ తేదీన ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని టీటీడీ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది.
xPress24, Tirumala, November 24,