xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
అంతర్జాతీయం

టెక్నాలజీ రంగంలో భారత్ కీలక ముందడుగు.. అమెరికా డిక్లరేషన్‌పై సంతకం

16-11-2026 12:22
టెక్నాలజీ రంగంలో భారత్ కీలక ముందడుగు.. అమెరికా డిక్లరేషన్‌పై సంతకం
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ ఎక్కువవుతున్న నేపథ్యంలో భారత్‌ కీలక అంతర్జాతీయ భాగస్వామ్యానికి సిద్ధమైంది. ఏఐ మౌలిక సదుపాయాలకు సంబంధించిన సరఫరా గొలుసుల భద్రతను బలోపేతం చేసేందుకు అమెరికా చేపట్టిన కార్యక్రమంలో భారత్‌ భాగస్వామిగా చేరింది.
xPress24, Hyderabad, November 16, ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ తీవ్రతరమవుతున్న వేళ భారత్‌ కీలక అంతర్జాతీయ భాగస్వామ్యానికి సిద్ధమైంది. సెమీకండక్టర్లు, అత్యాధునిక చిప్‌ల తయారీ, కీలక ఖనిజాలు, ఇంధన వనరులు, ఏఐ మౌలిక సదుపాయాలపై పట్టు సాధించేందుకు అమెరికా, చైనా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సాంకేతిక పరిజ్ఞానాల సరఫరా గొలుసుల భద్రతను బలోపేతం చేసేందుకు అమెరికా చేపట్టిన కార్యక్రమంలో భారత్‌ భాగస్వామిగా చేరింది. ఈ క్రమంలో అమెరికా ప్రతిపాదించిన 'శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌ ఆన్‌ ది సెక్యూర్‌ ఫౌండేషన్స్‌ ఆఫ్‌ ఎండ్యూరింగ్‌ ప్రాస్పరిటీ' పై భారత్‌ సంతకం చేసినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించింది. అమెరికా అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. భారత్‌తో పాటు జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌, దక్షిణ కొరియా, ఖతార్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఈ ప్రకటనపై సంతకాలు చేశాయని తెలిపారు. అలాగే జర్మనీ, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, యూరోపియన్‌ కమిషన్‌ వచ్చే వారంలో దీనిపై సంతకం చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. జార్జియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో,  జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటెగి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ హాజరయ్యారు. చైనా నుంచి పెరుగుతున్న సాంకేతిక, ఆర్థిక పోటీ నేపథ్యంలో కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందం ప్రాముఖ్యతను వివరిస్తూ, హెల్బర్గ్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ...  ఏఐ సరఫరా గొలుసులు అనేక దేశాలలో విస్తరించి ఉన్నాయని, అందువల్ల వాటి భద్రతకు అంతర్జాతీయ సహకారం అత్యవసరం అని పేర్కొన్నారు. కాగా, ఈ వారం షెన్‌జెన్‌లో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఏపెక్) శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సమావేశం కానున్న నేపథ్యంలోఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.