తెలంగాణ
టీజీ మ్యాథ్' రూపొందించిన ప్రతిష్ఠాత్మక ఏఐ సాక్షమ్
29-10-2026 09:36

సామాన్యుడి సమస్యల పరిష్కారమే సాంకేతికత వినియోగానికి నిజమైన కొలమానమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
xPress24, Hyd, October 28,
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ప్రణాళికా శాఖ సహకారంతో 'టీజీ మ్యాథ్' రూపొందించిన ప్రతిష్ఠాత్మక 'ఏఐ సాక్షమ్' కార్యక్రమాన్ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు.
...
ఏఐ సాక్షమ్ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. సాంకేతికత ఎంత అధునాతనమైనదన్న దానికంటే సామాన్య పౌరుడి జీవితంలో అది ఎలాంటి మార్పు తెచ్చిందన్నదే కీలకమని పేర్కొన్నారు. రైతులు, పింఛనుదారులు, పేద ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితిని ఏఐ వ్యవస్థల ద్వారా నివారించాలన్నారు. కార్యాలయాల్లో ఆదా అయ్యే ప్రతి గంట సమయాన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే వినియోగించాలని పిలుపునిచ్చారు.