xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
తెలంగాణ

డిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలి.. లేదంటే పోరాటం ఉధృతం: డీకే అరుణ

26-10-2026 09:16
పాలమూరు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు డిండి లిఫ్ట్ ప్రాజెక్ట్ అంశంపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. డిండి లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని ఆమె కోరారు.
xPress24, Mahabubnager, October 26, డిండి లిఫ్ట్‌ ప్రాజెక్టు అంశంపై మాట్లాడి పాలమూరు రైతులను రెచ్చగొట్టవద్దని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సూచించారు. డిండి లిఫ్ట్‌ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండు జిల్లాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. డిండి లిఫ్ట్‌ ద్వారా 0.6 టీఎంసీల నీటిని తరలించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాలమూరు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు నక్కలగండి, నాగార్జునసాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని డీకే అరుణ తెలిపారు. అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు పాలమూరు ప్రాంత ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే విధంగా డిండి లిఫ్ట్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొదటి డీపీఆర్‌ ప్రకారం చేపట్టి, ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను స్వయంగా సందర్శించి, వాటి ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తామని డీకే అరుణ వెల్లడించారు. అనంతరం ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. పాలమూరు రైతుల హక్కులు, సాగునీటి ప్రయోజనాల పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బైట్‌ 1:  డీకే అరుణ, ఎంపీ బైట్ 2. గోకులం రవి కుమార్ యాదవ్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.