xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. ఎన్‌టీఆర్ జిల్లాలో గణనీయంగా తగ్గిన ఎన్‌డీపీఎస్ కేసులు

21-11-2026 09:44
జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు ఎన్‌టీఆర్ జిల్లాలో పటిష్ట చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు.
xPress24, Vijayawada, November 20, విజయవాడ, నవంబర్ 20: జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు ఎన్‌టీఆర్ జిల్లాలో పటిష్ట చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని, సమష్టి కృషి, నిరంతర నిఘా, విస్తృత తనిఖీలు, ప్రజల్లో అవగాహన పెంపు ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్, ఎన్‌కార్డ్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు నిర్వహించిన సర్వే ఫలితాలు, ఈగల్ విభాగం సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలపై డీసీపీ కేజీవీ సరిత పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలోని 149 హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి మాదకద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2025లో జిల్లాలో 137 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 52 కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మాదకద్రవ్య రహిత ఎన్‌టీఆర్ జిల్లాను నిర్మించి యువతకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యమని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథంతో పాటు ఆధునిక విధానాలను అనుసరిస్తూ మాదకద్రవ్యాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణా, వినియోగం, సరఫరా వ్యవస్థలను గుర్తించేందుకు సమాచార ఆధారిత నిఘా, విస్తృత తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని వివరించారు. మాదకద్రవ్య కార్యకలాపాలకు పాల్పడుతున్న 42 మందిపై పిట్ ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు విస్తృతంగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలో ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్‌లకు ఎలాంటి చోటు లేదని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని అందించిన వారికి నగదు బహుమతితో సత్కరిస్తామని తెలిపారు. 1972 హెల్ప్‌లైన్‌కు అందుతున్న సమాచారాన్ని వేగంగా విశ్లేషించి, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈగల్ విభాగం, పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమష్టి కృషి, సమాచార మార్పిడి, నిరంతర నిఘా, విస్తృత తనిఖీల కారణంగా జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా, వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నామని వివరించారు. ఇదే సమన్వయంతో భవిష్యత్తులోనూ మరింత పటిష్టంగా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. సురక్షితమైన సామాజిక వాతావరణాన్ని నెలకొల్పడం ప్రతి ఒక్కరి బాధ్యతని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, ఈగల్ డీసీపీ వి. వేణుగోపాలరెడ్డి, ఈగల్ సీఐ ఎం. రవీంద్ర, డీఈవో ఎల్. చంద్రకళ, డీఎంహెచ్‌వో ఎ. శ్రావణబాబు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి. కామరాజు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ప్రతినిధి అరవ రమేష్, ఆకర్ష ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ టి.ఎస్. రావు, హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి మత్తె అనిల్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.