xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలుతన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలు
జాతీయం

డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారికి మరో అవకాశం: ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

07-11-2026 10:02
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారికి మరో అవకాశం: ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారికి తుది జాబితాలో చేరేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల సీఈవోలకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. బూత్ స్థాయి అధికారులు ఓటర్లను సంప్రదించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని, అర్హులైన ఎవరూ జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని స్పష్టం చేసింది.
xPress24, Delhi, November 6, ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాలు పొంది కూడా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. క్షేత్రస్థాయి పరిశీలనలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ వర్గాల కింద నమోదై తొలగింపునకు గురైన వారికి తుది జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించాలని నిర్ణయించింది. ఏడు రాష్ట్రాల సీఈవోలకు మార్గదర్శకాలు.. బీఎల్‌వోల క్షేత్రస్థాయి పరిశీలన ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జాబితాలో పేర్లు లేని ఓటర్ల వివరాలను సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలని పేర్కొంది. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లను నేరుగా కలిసి, ఈసీఐనెట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేలా సహాయం అందించాలని ఆదేశించింది. రాష్ట్ర పరిధిలోనే నివాసం మారిన ఓటర్లు, నిరాశ్రయులకు సైతం ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. పారదర్శక పర్యవేక్షణకు ఆదేశం అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా తుది జాబితాలో పేరు కోల్పోకుండా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈసీ స్పష్టం చేసింది. బోగస్ లేదా డూప్లికేట్ ఓట్ల నమోదు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.