జాతీయం
ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ఫిక్కీ సదస్సు
19-11-2026 09:48

ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
xPress24, Delhi, November 18,
ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సదస్సుతోపాటు వార్షిక కన్వెన్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
...పాజ్..
‘భారత్-2047’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖ కంపెనీల CEOలు, రాయబారులు, దౌత్యవేత్తలు, విధాన నిర్ణేతలు సహా 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర, పెట్టుబడుల అవకాశాలు, ఆర్థిక వృద్ధి, నూతన ఆవిష్కరణలపై ఈ వేదికగా చర్చించనున్నారు.
1927 ఏప్రిల్ 7న స్థాపించిన ఈ సంస్థ 2027 ఏప్రిల్ 7తో వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో 2026-27 సంవత్సరాన్ని ఫిక్కీ శతవార్షిక సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఫిక్కీ ప్రత్యక్షంగా 300కు పైగా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పారిశ్రామిక సంఘాల ద్వారా 2.5 లక్షలకు పైగా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.