ఆంధ్రప్రదేశ్
తండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి
10-11-2026 15:25
తల్లిదండ్రుల పరిస్థితులు, కుటుంబ నేపథ్యం చిన్నారుల భవిష్యత్తుకు అడ్డంకులుగా మారకూడదని, బాలల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు.
xPress24, Vijayawada, November 10,
విజయవాడ, నవంబర్ 10:
తల్లిదండ్రుల పరిస్థితులు, కుటుంబ నేపథ్యం చిన్నారుల భవిష్యత్తుకు అడ్డంకులుగా మారకూడదని, బాలల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ అధికారిక పత్రాల్లో తండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు’ అనే అంశంపై మంగళవారం విజయవాడలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాయపాటి శైలజ మాట్లాడుతూ.. ఒంటరి తల్లులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు తదితర ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలను సేకరించి, వాటి ఆధారంగా సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆమె తెలిపారు.