xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలుతన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‘ప్రకృతి మిత్ర తెలంగాణ’ ఆధ్వర్యంలో మంచిర్యాలలో అవగాహన కార్యక్రమంనేడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుఐదు దక్షిణాది రాష్ట్రాలకు వరిధాన్యం నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్రం అనుమతిఅయోధ్యలో ఘనంగా పదవ వార్షిక పవిత్ర ‘దీపోత్సవ్-2026’ వేడుకలు
అంతర్జాతీయం

తన అధికార బృందంలో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్

07-11-2026 12:45
ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికార యంత్రాంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుసీ వైల్స్ తన పదవికి రాజీనామా చేయగా, ట్రంప్ ఆమె స్థానంలో తన అత్యంత సన్నిహితుడు, పాత ఇమ్మిగ్రేషన్ విధానాల రూపకర్త అయిన స్టీఫెన్ మిల్లర్‌ను నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు.
xPress24, USA, November 7, మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవిచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన అధికార బృందంలో మార్పులు చేస్తున్నారు. తాజాగా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న సుసీ వైల్స్‌ను తొలగించి ఈ కీలక పదవిలో తన సన్నిహితుడు స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు. ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాజకీయ వ్యూహకర్త అయిన సుసీవైల్స్ 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్  ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అగ్రరాజ్యంలో అత్యంత కీలక పదవులుగా భావించే వైట్‌హౌస్‌ చీఫ్ ఆఫ్‌ స్టాఫ్ పదవికి ఎంపికయ్యారు. యూఎస్‌ చరిత్రలో ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా వైల్స్ రికార్డు సృష్టించారు. అయితే మధ్యంతర ఫలితాల్లో రిపబ్లికన్స్‌ ఓటమితో  ఆమెను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తన రాజకీయ బృందంలో వైల్స్ కొనసాగుతారని ట్రంప్ చెప్పారు. ఇంతకాలం వైల్స్‌కు డిప్యూటీగా ఉన్న  స్టీఫెన్ మిల్లర్‌ ను ఆ స్థానంలో నియమించినట్లు వెల్లడించారు. byte.. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.